డెంగ్యూ జ్వరం నివారణలో కీలకంగా ఆయుర్వేద వన మూలికలు…ఇలా ఉపయోగిస్తే సరి!

వర్షాకాలం వస్తూ తనతో పాటు ఎన్నో రోగాలను వెంటబెట్టుకొని వస్తుంది. వర్షాకాలంలో జలుబు దగ్గు జ్వరం తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అక్కడక్కడ నీరు నిల్వ ఉండటం వల్ల దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ చికెన్ గునియా వంటి ఎన్నో రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ క్రమంలో
సీజన్ వ్యాధుల నుంచి బయటపడటానికి కొన్ని వనమూలికలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వ్యాపించడానికి ప్రధాన కారణం వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందింది. ఈ క్రమంలో వేపాకులతో పొగ వేయడం వల్ల దోమలను నివారించడమే కాకుండా పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది. వేప ఆకులలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వేప ఆకులతో వేసిన పొగ డెంగ్యూ రోగులలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేప ఆకులను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు.

ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే తిప్పతీగలో కూడా ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న సమయంలో తిప్పతీగ నుండి తీసిన రసం తాగడం వల్ల ఈ జ్వరం నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే తిప్పతీగ కాడలను నీటిలో నానబెట్టి ఆ నీటిని వడకట్టి తాగటం వల్ల కూడా డెంగ్యూ జ్వరం నుండి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నేలవేము ఆకులో ఉండే ఔషధ గుణాలు కూడా డెంగ్యూ జ్వరం నివారణలో ఎంతో ఉపయోగపడతాయి.