వర్షాకాలం అనగానే ఎన్నో రోగాలను వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిలువ ఉండటం వల్ల దోమల సంఖ్య పెరిగి అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు దోమల వల్ల వ్యాపిస్తాయి. సరైన సమయంలో ఈ వ్యాధులకు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వ్యాపించి డెంగ్యూ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. వర్షాకాలంలో డెంగ్యూ దోమల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో తీవ్రమైన చలితో కూడుకున్న జ్వరం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా నోరు తడారిపోవడం చర్మం మీద ఎరుపు రంగులో దద్దుర్లు గొంతు నొప్పి పొడి దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయి. డెంగ్యూ వ్యాధి సోకిన వారిలో రక్తస్రావం, అవయవవాల పనితీరు మందగించడం, ప్లాస్మా లీకేజీ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు. అంతే కాకుండా వాంతులు, నీరసం, కళ్లు నొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుండి తొందరగా బయటపడవచ్చు.
డెంగ్యూ వ్యాధి సోకినవారు శరీరంలో వ్యాది నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, ద్రాక్ష , కివి వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటూ తాజా పళ్ళ రసాలను తాగుతూ ఉండాలి. డెంగ్యూ వ్యాధి సోకినవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా నీరసం నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కొబ్బరినూనె ఇల్లు ఎంతో ఉపయోగపడతాయి. డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది అందువల్ల బొప్పాయి పండు తినటమే కాకుండా వాటి ఆకులతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం వచ్చిన వారు మాంసాహారానికి కొంతకాలం దూరంగా ఉండటం మంచిది.