బిగ్‌బాస్ నాలుగో సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. రేస్ టు ఫినాలే మొదలైన నేపధ్యంలో హౌస్‌లో గేమ్ హోరా హోరీగా సాగుతోంది. గేమ్‌లో భాగంగా ఒకరి పై మరొకరు రెచ్చిపోతూ టిక్కెట్ టు ఫినాలే కోసం అభిజిత్, అఖిల్, అరియనా, అవినాష్, సోహైల్, మోనాల్, హరికలు గట్టిగానే పోటీ పడ్డారు. అయితే తొలుత మోనాల్ చేసిన పనికి హర్ట్ అయిన అవినాష్, సహనం కోల్పోయాడు. ఆ తర్వాత అఖిల్, సొహైల్‌లు కలిసి ఆడుతున్నారు ఫైర్ అయ్యాడు.
ఇక ఆ తర్వాత పాలల్లో నీళ్ళుకలిపడంతో బిగ్‌బాస్ అవినాష్‌ని ఫినాలే టాస్క్ నుండి తప్పించాడు. ఆ తర్వాత అరియానా పాలబాటిల్స్ తక్కువ ఉండడంతో ఆమెకు కూడా ఝలక్ ఇచ్చాడు. నెక్స్ట్ మోనాల్ కూడా గేమ్ నుండి బయటకు వచ్చింది. దీంతో సెకండ్ రౌండ్‌లోకి హారిక, అభిజిత్, అఖిల్, సొహైల్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఈ రౌండ్‌లో అభిజిత్, హారికలు అవుట్ అయిపోగా, మూడో రౌండ్‌లోకి అఖిల్ అండ్ సొహైల్‌లు చేరుకున్నారు.
ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆశక్తిగా మారింది. బయట సోషల్ మీడియలో టాక్ ఎలా ఉందంటే అవినాష్, మోనాల్, అరియానా ఈ ముగ్గిరిలో ఒకరు బ్యాగ్ సర్ధుకోవడం ఖాయమంటున్నారు. అయితే ఓటింగ్ పరంగా, హౌస్‌లో జరుగుతున్న సిట్యువేషన్స్ బట్టి చూస్తే.. మోనాల్ ఎలిమినేట్ అవడం ఖాయమనిపిస్తోంది. ఈ వీక్ నామినేషన్‌లో అరియానా, సొహైల్‌లు తప్పా, మిగతా ఐదుగురు ఉన్నారు.
అయివతే ఇక్క షాకింగ్ మ్యాటర్ ఏంటంటే రేస్‌టుఫినాలే అఖిల్ గెలిస్తే.. ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అవుతాడు. అభి తర్వాత ఎక్కువ ఓట్లు పడేది అఖిల్‌కే కాబట్టి, హౌస్‌లో కంటెస్టెంట్ల పొజిషన్స్ దారుణంగా మారిపోతాయి. దీంతో మొదట చిక్కుల్లో అరియానా పడుతుంది. అరియానా ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చోమే గానీ ఇక లాజిక్ ఏంటో గమనిస్తే మీకే అర్ధమవుతోంది. ఈ వారం సేఫ్ జోన్‌లో ఉన్న అరియానా నెక్స్ట్ వీక్ నామినేషన్ లోకి వస్తుంది.
అది ఎలా అంటే.. మోనాల్ అవినాష్‌ని కాలితో తన్నిందరే ఇష్యూలో అక్కడే ఉన్న అరియానా ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. దీంతో ఈ పాయింట్‌లో సొహైల్ అరియానాని నామినేట్ చేసే చాన్సెన్ ఎక్కువగా ఉన్నాయి. అదే పాయింట్‌లో అవినాష్ కూడా నామినేట్ చేసే చాన్స్ ఉంది. హౌస్‌లో అమ్మాయిల్లో గేమ్ ఆడడంలో కానీ, ఎలాంటి సిట్యువేషన్స్‌లో అయినా టాప్‌లో ఉంటుంది. గేమ్ పరంగా కూడా అబ్బాయిలకు పోటీనిచ్చేలా ఏమాత్రం తగ్గకుండా అడుతుంది అరియానా.
దీంతో వచ్చే వారం అరియానా నామినేషన్స్‌లోకి రాకూడదనే అనుకుందాం.. ఒకవేళ ఈ బోల్డ్‌భామ నామినేషన్‌లోకి వస్తే అఖిల్ నామినేషన్‌లో ఉండడు, మరోవైపు ఈ వారం మోనాల్ ఎలిమినేట్ కాకుంటే వచ్చేవారం ఈ గుజరాతి భామ నామినేషన్‌లోకి వచ్చినా అఖిల్ ఫ్యాన్స్ మొత్తం మోనాల్‌కు ఓట్లు వేస్తారు. అలాగే సొహైల్ నామినేషన్‌లోకి రాకుంటే అతని ఫ్యాన్స్ కూడా మోనాల్‌కు ఓట్లు వేసే చాన్స్ ఉంది. దీంతో మోనాల్ సేవ్ అయ్యి అరియానా ఎలిమినేట్ అవుతుంది.
ఈ వీక్ అవినాష్ వెళ్ళిపోయి మోనాల్ సేవ్ అయితే మాత్రమే అరియానా చిక్కుల్లో పడుతోంది. ఈ లాజిక్ పరంగా ఇలా చూసుకుంటే అరియానా బిగ్ ప్రాబ్లంలోఉందని చెప్పాలి. మోనాల్‌తో పోల్చుకుంటే అరియానా వందశాతం బెస్ట్. మోనాల్‌లా ఎలాంటి డ్రామా యాక్టింగ్ చేయదు. కావున ఇలా జరగకపోతే మంచిదే.. అలా జరగాలంటే అరియానా టాప్ ఫైవ్‌లో ఉండాలంటే అరియానా ఫ్యాన్స్ ఆమె కోసం మరిన్ని ఎక్కువ ఓట్లు వచ్చేలా చేయాలి.
ఈ వీక్ అవినాష్ సేవ్ అయితే అరియానాకు ప్లస్ అవుతోంది. అయితే అవినాష్ పాల బాటిల్స్ టాస్క్‌లో సహనం కోల్పోయి చేసిన ఓవర్ యాక్షన్ అతనికి మైనస్‌గా మారింది. గతవారం ఎవిక్షన్ కార్డుతో సేఫ్ అయిన తర్వాత అతని బిహేవియర్ మరింత దిగజారింది. దీంతో ఈ జబర్ధస్త్ కమెడియన్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అయితే గత రెండు రోజులుగా మోనాల్ పై కూడా బాగా నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
అవిని కాలుతో తన్నిన మ్యాటర్‌లో ఒకసారి ఒప్పుకోవడం, మరోసారి తన్నానని ఒప్పుకోకపోవడం.. ఇలాంటివి మోనాల్ పెద్ద మైనస్‌గా మారాయి. హౌస్‌లో గత వారం జరిగిన మెలోడీ డ్రామా కారణంగా అందరూ అవినాష్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో అతని పై కాస్త సింపథీ వచ్చినమాట వాస్తవమే.. దీంతో ఈసారి అవినాష్‌కు ఎక్కువ ఓట్లు పడితే అతను సేవ్ అవడమే కాకుండా అరియానా కూడా సేవ్ అయ్యి టాప్ ఫైవ్‌లోకి చేరుకుంటుంది.