పట్టపగలే దారుణం.. మాదాపూర్ లో దారుణ హత్యకు గురైన కార్పెంటర్?

ప్రస్తుత కాలంలో హత్యలు, నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలు, పాత కక్షలు, ఆస్తి తగాదాలు వంటి ఎన్నో కారణాలవల్ల ప్రతిరోజు ఎంతోమంది హత్యకు గురవుతున్నారు. తాజాగా మాదాపూర్ లో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ తాన పరిధిలో నివాసముంటున్న ఒక కార్పెంటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… పొట్టకూటికోసం ఎంతోమంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెలుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాజస్థాన్ కి చెందిన ప్రేమా రామ్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం హైదరాబాద్ కి వలస వచ్చి మాదాపూర్ లోని సిద్దిఖ్‌నగర్‌ బస్తీలో మెహర్‌రామ్‌ అనే వ్యక్తితో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రేమా రామ్ కార్పెంటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల క్రితం మెహర్ రామ్ తన స్వస్థలానికి వెళ్లగా ప్రేమా రామ్ మాత్రమే ఒంటరిగా గదిలో ఉంటూ కార్పెంటర్ పని చేసుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రేమా రామ్ పనికి వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోరుగింట్లో ఉండే వ్యక్తి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో ప్రేమా రామ్ గది తలుపులు తెరిచే ఉండటంతో అతను లోపలికి వెళ్లి చూడగా ప్రేమా రామ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమాని మౌలానా విషయం చెప్పటంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా..మృతుడి మెడ వెనుక, చేతులపై కత్తితో పొడిచిన గాయాలు పోలీసులు గుర్తించారు. దీంతో పోలిసులు కేసు నమోదు చేసుకొని ప్రేమారామ్‌ తో పాటు గతంలో ఎవరెవరు ఉండేవారనే విషయాలనూ ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించనున్నారు.