ఎవరికైనా పదోన్నతి పెరిగితే ఎలా ఉంటది. కాస్తో కూస్తో వాళ్లు తమ టెంపర్ ను చూపిస్తారు. ఎమ్మెల్యే నుంచి టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు రాజకీయం కూడా ప్రస్తుతం అలాగే ఉందట. ఆయన రాజకీయాలు మామూలుగా ఉండటం లేదట. ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అవ్వడమేందో కానీ.. ఆయన వల్ల సీఎం జగన్ కు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయట.
వైసీపీని ఇరుకున పెట్టడం కోసం అచ్చెన్నాయుడు విశ్వప్రయత్రాలు చేస్తున్నారట. శ్రీకాకుళానికి, అమరావతికి లింకులు పెడుతూ… వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఇరుకున పెట్టాలన్నది అచ్చెన్నాయుడు ప్లాన్ అట. అయితే అమరావతిని రాజధానిని చేయండి.. లేదంటే శ్రీకాకుళాన్ని చేయండి.. అంటూ కొత్త వాదనను తెరమీదికి తీసుకొస్తున్నారు అచ్చెన్నాయుడు.
అయితే.. శ్రీకాకుళం రాజధాని డిమాండ్ అనేది ఇప్పుడే తెరమీదికి వచ్చిందేమీ కాదు. ఎప్పటి నుంచో ఉంది. మొన్నటి దాకా టీడీపీ అధ్యక్షుడిగా చేసిన కళా వెంకట్రావు కూడా రాజధానిగా శ్రీకాకుళాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం శ్రీకాకుళాన్న రాజధానిగా ప్రకటిస్తే భూముల విషయం తాను చూసుకుంటానంటూ… వెంకట్రావు.. సీఎం జగన్ కు హామీ ఇచ్చినా… జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు అచ్చెన్న కూడా అదే వాణి వినిపిస్తుండటంతో వైసీపీకి మరో తలనొప్పి స్టార్ట్ అయిందట.
ఓవైపు వైసీపీ ప్రభుత్వమేమో… మూడు రాజధానులు అంటుంటే.. టీడీపీ ఏమో.. శ్రీకాకుళం రాజధాని అంటూ కొత్త డిమాండ్ ను తెరమీదికి తేవడం… వైసీపీని ఇరుకున పెడుతుండటంతో సీఎం జగన్.. దీనిపై ఎలా స్పందించాలో తెలియక తల పట్టుకుంటున్నారట.