నయనతార పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి.. ఏమన్నారంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార గత కొన్ని రోజుల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే నయనతార తన చేతికి ఉన్న నిశ్చితార్థపు రింగ్ కూడా చూపించారు. అయితే గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట ఏ విధంగానూ స్పందించలేదు. ఇక పోతే వచ్చే నెల 9వ తేదీ వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని వీరి పెళ్లి శ్రీవారి సన్నిధిలో జరుగుతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా తమ అభిమాన నటి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందని అభిమానులు సంతోష పడగా, వారి సంతోషాన్ని వేణు స్వామి ఆవిరి చేశారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు సంపాదించుకున్న వేణు స్వామి సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నా విడిపోతారని గతంలో చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇక అప్పటి నుంచి నిత్యం సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఈయన వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే విషయం తెలియడంతో ఈయన నయనతార పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నయనతార జాతకంలో గురువు నీచ స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె వైవాహిక జీవితం ఎంతో సజావుగా సాగాదని, ఈమె పెళ్లి చేసుకున్న విడిపోతారని, వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేశారు. ఈమె జాతకంలో గురువు నీచ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా తనకు వివాహం జరిగిన తన భర్త నుంచి విడిపోతారని ఈయన నయనతార పెళ్లి గురించి ఆమె జాతకంలో ఉన్న దోషం గురించి బయట పెట్టారు. శుభమా అంటూ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సమయంలో వీరి జాతకం గురించి వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. మరి నయనతార విషయంలో కూడా వేణుస్వామి చెప్పిన మాటలు నిజమవుతాయా అనేది తెలియాల్సి ఉంది.