వైరల్ : పాక్ మ్యాచ్ లో కోహ్లీని జ్యోతికతో పోల్చిన బౌలర్ అశ్విన్.!

భారతదేశంలో ప్రజలు సినిమాలు అలాగే క్రికెట్ కి చాలా పెద్ద పీఠ వేస్తారు అంతే కాకుండా దేశంలో అతి పెద్ద బిజినెస్ మరియు అదరణగా అంతే స్థాయిలో ఉంటుంది. ఇక రీసెంట్ గానే ప్రపంచ టి20 కప్ స్టార్ట్ కాగా మన ఇండియన్ జట్టు మొదటి అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో స్టార్ట్ కావడం ఆ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.

మరి ఈ మ్యాచ్ లో అయితే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైండ్ బ్లాకింగ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ నుంచి అద్భుతమైన విజయాన్ని అందించింది. చాలా కాలం తర్వాత కోహ్లీ కం బ్యాక్ అందులోని పాకిస్తాన్ లాంటి జట్టు పై రావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.

ఇక ఇదే మ్యాచ్ లో లాస్ట్ లో కోహ్లీతో దిగిన స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ లేటెస్ట్ గా ఆరోజు కోహ్లీ ఇన్నింగ్స్ పై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ కోహ్లీ మొదటి 45 బాల్స్ ఆట అలా వదిలేస్తే..

తర్వాత 45 బాల్స్ నుంచి చంద్రముఖి లో జ్యోతిక చేసిన గంగ లా మారిపోయాడు అని కామెంట్స్ చేసాడు. చంద్రముఖి లో నటుడు ప్రభు తో జ్యోతిక సీన్ ఉంటుంది కదా దానిని ఉదాహరణగా చెప్తూ అశ్విన్ అయితే పోల్చాడు. దీనితో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి.