Priyadarshi: ప్రియదర్శికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ కపుల్స్… ఈయన రేంజే మారిపోయిందిగా!

Priyadarshi: ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల నాని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో లాయర్ సూర్య పాత్రలో ప్రియదర్శి నటన అద్భుతమని చెప్పాలి. ఈయన నటనపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న అనంతరం ప్రియదర్శి సారంగపాణి జాతకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈయన ఫ్లవర్ బొకే పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో హీరోయిన్లు అయినటువంటి సూర్య జ్యోతిక దంపతుల నుంచి వచ్చినట్టు తెలిపారు.

సూర్య జ్యోతిక ఇద్దరు కూడా కోర్టు సినిమాలోని ప్రియదర్శి నటనకు ఫిదా అవడంతో వారిద్దరూ సూర్య పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన కోసం ఒక ఫ్లవర్ బొకే పంపించారు. ఇక ఈ ఫోటోని ప్రియదర్శి షేర్ చేస్తూ…మీరు పంపిన బొకేతో సందేశాన్ని అందుకోవడం నా హృదయానికి తాకిందని.. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబ వెనుక నుంచి గర్భంగా తట్టినట్లు అనిపించిందని.. నన్ను బాగా ప్రేరేపించిన ఈ జంటకు చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.

మల్లేశం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియదర్శి అనంతరం పలు సినిమాలలో కామెడీ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు కానీ ఇటీవల కాలంలో ఈయన సినిమాలలో హీరోగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన నటనకు పాన్ ఇండియా స్టార్ హీరో నుంచి ప్రశంసలు దక్కడంతో ప్రియదర్శి రేంజ్ మారిపోయిందని అభిమానులు భావిస్తున్నారు.