Surya-Jyothika: దైవభక్తిలో మునిగిపోయిన జ్యోతిక,సూర్య.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్!

Surya-Jyothika: కోలీవుడ్ కపుల్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతికల గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కెరియర్ పరంగా ఎవరికి వారు ఫుల్ బిజీ బిజీగా ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి అలా వేకెషన్ లు తిరుగుతూ ఉంటారు. పెద్దగా వివాదాల జోలికి వెళ్లకుండా వారి పనేదో వారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ జంట ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కూడా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం జ్యోతిక దక్షిణాదిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా కొంతమంది ఆమె పాత వీడియోలను బయటికి తీసి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో 2020లో ఒక అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. దేవాలయాలకు పెయింట్స్ వేయడం, మిగతా ఖర్చులు వృథా. అదే డబ్బుని ఆస్పత్రులు, స్కూల్స్ కోసం ఉపయోగించవచ్చు కదా అని మాట్లాడింది. అయితే డబ్బుని హాస్పిటల్స్, స్కూల్స్ కోసం ఉపయోగించాలని చెప్పడం బాగుంది కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల కోసం అంత ఖర్చు ఎందుకని చెప్పడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అప్పట్లో అసలు గుడికి ఎందుకు వెళ్లడం అనే స్టేట్‌మెంట్ ఇచ్చిన జ్యోతిక..

 

ఇప్పుడు ఏకంగా భర్త సూర్యతో కలిసి కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంది. చండీకా యాగం కూడా చేయించింది. కొన్ని రోజుల క్రితం ఇదే దేవాలయానికి ఎన్టీఆర్ కూడా వెళ్లాడు. తాజాగా సుప్రభాత సేవ సమయంలో జ్యోతిక.. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంది. పెద్దగా బయటే కనిపించని జ్యోతిక.. ఇలా వరసగా ప్రముఖ దేవాలయాల్ని సందర్శించడం కాస్త విచిత్రమే అని చెప్పాలి. దాంతో గతంలో ఆమె మాట్లాడిన మాటలను వైరల్ చేస్తూ మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఆమెపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఇటీవల సూర్య నటించిన కంగువ సినిమా ఫ్లాప్ అయింది కదా,అందుకే పూజలు పునస్కారాలు చేస్తున్నట్టు ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి సినిమా ఫ్లాప్ అయిందని జ్యోతిక,సూర్య దేవాలయాల్ని సందర్శిస్తున్నారా? లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.