బర్త్ డే రోజు బెంజ్ కార్ గిఫ్ట్ గా అందుకున్న ఆషు .. స్పాన్సర్ ఎవరో తెలుసా…!

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారిలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమా అవకాశాలను అందుకున్న వారిలో ఆషూరెడ్డి కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటించిన ఆశు రెడ్డికి ఆ సినిమాల ద్వారా చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో ఈ అమ్మడు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనింది.

బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఆషు రెడ్డి ఆ సీజన్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కూడా పాల్గొనింది. అయితే ఈ రెండు సీజన్లలో కూడా ఆశు రెడ్డి టైటిల్ దక్కించుకోలేకపోయినా కూడా ఈ బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మడు బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కూడా పాల్గొంటుంది. . ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆషూ రెడ్డి ఇటీవల తన బర్తడే కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వైట్ కలర్ బెంజ్ కార్ పక్కన నిలబడి ఉన్న ఫోటోలను ఆశు రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉన్న వైట్ కలర్ బెంజ్ కార్ ని ఆశూ రెడ్డి తన బర్త్డే గిఫ్ట్ గా అందుకుంది. అయితే ఈ కారుని ఆశు రెడ్డి తండ్రి తన బర్త్డే రోజున గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ఖరీదు దాదాపు రూ..72 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొత్త కారు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ” సారీ అమ్మ, కోపం తెచ్చుకోకు ఇది డాడీ గిఫ్ట్ అంటూ రాసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.