జగన్ కు మంటపుట్టిస్తున్న ఉండవల్లి..జగన్ జైలుకు వెళితే..?

cm jagan undavalli arunkumar telugu rajyam

 జగన్ కు అనుకూలమైన వ్యక్తిగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య కాలంలో జగన్ మీద అనేక విమర్శలు చేస్తూ, మీడియాతో పాటుగా వైసీపీ నేతల దృష్టిలో పడుతున్నాడు, తాజాగా పోలవరం మీద మాట్లాడటానికి మీడియా ముందుకొచ్చిన ఉండవల్లి జగన్ ను రెచ్చకొట్టే విధంగా మాట్లాడటం మాట్లాడుతూ, పోల‌వ‌రం విష‌యంలో ప్ర‌శ్నించే ధైర్య సాహ‌సాలు జ‌గ‌న్‌లో ఏమ‌య్యాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌శ్నించారు, ఆ దైర్యం కూడా లేకపోతే పోల‌వ‌రంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు కోర్టులో కేసు వేశార‌ని, దానికి ఇంప్లీడ్ కావాల‌ని ఉండ‌వ‌ల్లి రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించారు.

undavalli arunkumar

 పోల‌వ‌రానికి నిధులు రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులు కొన్ని రోజులు విమ‌ర్శిస్తుండ‌డాన్ని చూస్తున్నాన‌న్నారు. పోల‌వ‌రం విష‌యంలో చంద్ర‌బాబు విఫ‌లం కావ‌డం వ‌ల్లే జ‌నం ఆయ‌న‌కు బుద్ధి చెప్పార‌న్నారు. తాము కూడా అలా కావాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం అనుకుంటున్న‌దా అని ఉండ‌వ‌ల్లి గ‌ట్టిగా నిల‌దీశారు. పోలవరం పరిస్థితి ఈ విధంగా అవుతుందని తాను అసలు అనుకోలేదని, టీడీపీ, వైసీపీ వాలకం చూస్తుంటే తప్పు నీదంటే నీది అన్నట్లు నిందించుకోవడం తోనే కాలం గడిపేసేలా ఉన్నాయి , చివరికి పోలవరాన్ని వదిలిపెట్టి పట్టిసీమకే వీళ్ళు అంకితమైయ్యేలా ఉన్నారు.

 పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మాట మారుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదు? ఇంత జరుగుతున్నా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ నోరెత్తలేదేం?.కేసులు ఉండటం వల్లే మోదీని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారం జనంలో ఉంద‌న్నారు. జగన్‌ను మోదీ జైలులో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంద‌ని, జగన్‌ను జైలులో వేయటం అంత సులువా? కింద కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్ళి అది తేలే సమయానికి ముసలోళ్ళు అయిపోతారు కాబట్టి జగన్ కు కేసుల భయం అవసరం లేందటూ ఉండవల్లి మాట్లాడాడు, ఉండవల్లి ప్రసంగం మొత్తం ఉంటే జగన్ ను రెచ్చకొట్టి పోలవరం విషయంలో కేంద్రంతో అమితుమీ తేల్చుకునేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టినట్లు అర్ధం అవుతుంది.