Arrest Sunny Leone : ‘సన్నీలియోన్’ని అరెస్ట్ చెయ్యాల్సిందే.. కానీ, ఎందుకు.?

Arrest Sunny Leone : సన్నీలియోన్ ఇటీవల ఓ పాటలో కనిపించింది. ఆ పాట ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. ఓ రాజకీయ ప్రముఖుడు, ఆ పాటని బ్యాన్ చేయడంతోపాటుగా, సన్నీలియోన్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ పాట ఏంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సన్నీలియోన్‌ని అరెస్ట్ చేయాలనే డిమాండ్ తరచూ వినిపిస్తూనే వుంటుంది. ఎందుకని.?

సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్. తొలిసారి ఆమె బాలీవుడ్ సినిమాల కోసం ఇండియా వచ్చినప్పుడు, ఆమెను అరెస్టు చేయాలంటూ పెద్ద ఉద్యమం నడిచింది. ఆమెకు ముంబైలో వుండడానికి ఇల్లు దొరకలేదు. అద్దె ఇల్లు (అపార్టుమెంట్) కోసం ఆమె పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.

‘సన్నీలియోన్‌తో నటిస్తే, విడాకులు ఇచ్చేయాల్సి వస్తుంది..’ అంటూ కొందరు ప్రముఖ హీరోలకు, వారి భార్యల నుంచి హెచ్చరికలు అప్పట్లో వచ్చాయట. కానీ, సన్నీలియోన్ బాలీవుడ్ ఎంట్రీని ఎవరూ ఆపలేకపోయారు. చాలా తక్కువ సమయంలోనే చాలా పెద్ద స్టార్ అయిపోయింది సన్నీలియోన్. బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్‌లో కూడా ఆమె సినిమాలు చేసింది.

సన్నీలియోన్ ఏదన్నా సినిమాలో నటిస్తే వివాదం.. ఇంకేదన్నా పని చేస్తే వివాదం. కానీ, ఆమె పాపులారిటీ మాత్రం తగ్గడంలేదు. ఆమెకు అవకాశాలూ తగ్గడంలేదు. ప్రతి వివాదమూ తనకు అదనపు పబ్లిసిటీ ఇస్తోందన్నది సన్నీలియోన్ గట్టి నమ్మకం. భారతీయ మూలాలున్న సన్నీలియోన్, ఇండియాలోనే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.