గోవా బీచ్‌లో అరియానా ర‌చ్చ‌.. సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంతో ఫుల్ పాపుల‌ర్ సంపాదించుకున్న అందాల భామ అరియానా గ్లోరీ. బిగ్ బాస్ షోకు రాక‌ముందు చిన్న చితకా షోస్ చేస్తూ వ‌చ్చిన అరియానా ఓ సారి రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఇంట‌ర్వ్యూ చేసి కొంత పాపులారిటీ ద‌క్కింది. వ‌ర్మ ఈ అమ్మ‌డిపై వేసిన పంచ్‌ల‌తో అరియానాకు ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇక బిగ్ బాస్ షోతో ఓ ఊపు ఊపేసింది. స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా మాట్లాడే వ్య‌క్త్తిత్వం జ‌నాల‌కు బాగా న‌చ్చింది. అబ్బాయిల‌కు పోటీగా అరియానా ప్ర‌తి విష‌యంలోను అద‌ర‌గొట్టింది. అందుకే ఆమెకు పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అరియానా ప్ర‌స్తుతం శ్రీముఖి గ్యాంగ్‌తో గోవాలో ర‌చ్చ చేస్తుంది. విష్ణుప్రియ‌, ఆర్జే చైతూ, సుశృత్‌తో పాటు ప‌లువురు స్నేహితులు గోవా టూర్ వేయ‌గా, వారు అక్క‌డి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా అరియానా షార్ట్ డ్రెస్‌లో సెగ‌లు రేపుతుంది. అరియానా అంద‌చందాల‌కు అభిమానులు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు. శ్రీముఖి కూడా రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గోవాలో చేసిన సంద‌డికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసి ర‌చ్చ చేసింది.

అరియానా విష‌యానికి వ‌స్తే బిగ్ బాస్ త‌ర్వాత ఈమె లైఫ్ పూర్తిగా మారింది. ప‌లు షోస్‌తో పాటు సినిమాలు కూడా చేస్తుంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాజెక్టుల‌కు క‌మిటైన అరియానా త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. ఇటీవ‌ల రాజ్‌త‌రుణ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు చిన్న హింట్ ఇచ్చింది. రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి అరియానా దిగిన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఈ అమ్మ‌డు మూవీకి ఓకే చెప్పిసి ఉంటుంద‌ని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.