Keerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె తన ప్రేమికుడు ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు కీర్తి సురేష్ వెల్లడించారు. ఇలా 15 సంవత్సరాలుగా మేమిద్దరం ప్రేమలో ఉన్నామని అయితే మా వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికి ఇష్టం లేకపోవడం వల్లే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదని తెలిపారు.
ఇక వీరి వివాహం డిసెంబర్ 12వ తేదీ గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హిందువులు కావడంతో హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం వీరి వివాహాన్ని జరిపించారు. అనంతరం క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశారు. తాజాగా తన పెళ్లి గురించి కీర్తి సురేష్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆంటోనీ కుటుంబ సభ్యులు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని చెప్పారు అయితే ఈ విషయం నేను నాన్న దగ్గర చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా భయపడ్డానని తెలిపారు.
క్రిస్టియన్స్ సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురిని తండ్రి తన కూతురు చేయని పట్టుకొని వేదికపైకి తీసుకురావాలి. అలా చేయడానికి నాన్న ఒప్పుకుంటారా లేదా అని చాలా భయం ఉండేది ఇదే విషయం నాన్న దగ్గరకు వెళ్లి అడిగాను. నాకోసం మీరు కూడా అలా చేస్తారా నాన్న అంటూ నాన్నని అడగడంతో వెంటనే నాన్న తప్పకుండా చేస్తాను. మనం రెండు సంప్రదాయాల్లో వివాహం జరుపుతున్నాం. కాబట్టి నేను కూడా ఆ పద్ధతులు పాటిస్తాను అంటూ నాన్న చెప్పడంతో నా సంతోషానికి అవధులు లేవని కీర్తి సురేష్ తెలిపారు.నేను చెప్పిన దానికి ఆయన అంగీకరిస్తారని ఊహించలేదు. కానీ ఆయన నాకోసం ఆవిధంగా చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈమె తన సంతోషాన్ని బయటపెట్టారు.