Booster Dose: ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో దేశంలో బూస్టర్ డోస్ పంపిణీ చేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది . జనవరి 10 నుంచి అర్హులైన వారందరికీ ప్రభుత్వం బూస్టర్ డోస్ టీకాలను వేస్తున్నారు. అయితే ఏ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేసుకోవాలన్న సందేహం అందరిలో కలుగుతోంది. మీ సందేహం తీరాలంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.
ప్రభుత్వం అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ వేయటానికి అన్ని సిద్ధం చేసింది. అయితే భారతదేశంలో బూస్టర్ డోస్ గా మూడు వ్యాక్సిన్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటివరకు దేశంలో అత్యవసర వినియోగానికి 8 టీకాలను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ బూస్టర్ డోస్ గా 3 టీకాలను మాత్రమే ఆమోదించింది.
” సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వారి కోవిషీల్డ్,రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V “ఈ మూడింటిని భారత ప్రభుత్వం బూస్టర్ డోస్ గా అనుమతించింది. కరోనా 2 టీకాలు కోవిషీల్డ్ వేసుకున్న వారికి ఇప్పుడు బూస్టర్ డోస్ గా కోవిషీల్డ్ , మొదటి 2 వ్యాక్సిన్లు కోవాక్సిన్ తీసుకున్నవారు ఇప్పుడు కోవాక్సిన్ మాత్రమే బూస్టర్ డోస్ గా తీసుకోవాలి . అలాగే మొదటి రెండు డోసులు స్పుత్నిక్ V తీసుకున్నవారు ఇప్పుడు బూస్టర్ డోస్ గా స్పుత్నిక్ V మాత్రమే తీసుకోవాలి . తాజాగా ప్రభుత్వం కార్బోవాక్స్, కోవోవాక్స్ టీకాలను కూడా ఆమోదించింది. కానీ ఈ రెండు టీకాలు ఇంకా బూస్టర్ డోస్‌లో చేర్చలేదు.
ప్రైవేట్ ప్రభుత్వ డొమైన్లలో ఎన్నో రకాల వ్యాక్సిన్ ఉన్నప్పటికీ ఈ మూడింటిని మాత్రమే ప్రజలకు అందించటానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదివరకు రెండు డోసులు ఈ టీకాలను వేసుకున్నట్లయితే ఈజీగా బూస్టర్ డోస్ దొరుకుతుంది.. లేక వేరే ఇతర వ్యాక్సిన్ వేసుకున్న వారు బూస్టర్ డోస్ కోసం ఎదురు చూడక తప్పదు.