Migraine: మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా..? ఈ పదార్ధాలతో మైగ్రేన్ కి చెక్ పెట్టవచ్చు..!

Migraine : పుస్తకాలు మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో తలనొప్పి సమస్య ప్రధానమైనది. సాధారణంగా ప్రతి రోజు ఏదో ఒక సమయంలో అందరికీ ఈ సమస్య వస్తుంది. కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవటం, టాబ్లెట్ వేసుకోవడం వల్ల సాధారణ తలనొప్పి తొందరగా తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ ఒక దీర్ఘకాలిక సమస్య.

చాలామందికి మైగ్రేన్ తలనొప్పికి సాధారణ తలనొప్పి కి తేడా తెలియదు. సాధారణంగా తలనొప్పి వచ్చినప్పుడు 10 నిమిషాలలో తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటూ కళ్ళు తిరగటం, వాంతులు, తల సగం భాగం లో నొప్పి,మెడ, దవడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. మైగ్రేన్ తలనొప్పికి వైద్యుల సలహాలు తీసుకోవడం మాత్రమే కాకుండా మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి కూడా మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.

మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే లవంగాలు మైగ్రేన్ తల నొప్పి తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. మైగ్రేన్ తలనొప్పి సమస్యతో బాధపడేవారు లవంగాలతో తయారుచేసిన టీ తాగటం వల్ల ఆ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. లవంగాల లోయాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల లవంగాలతో తయారు చేసిన టీ తాగటం వల్ల జలుబు, దగ్గు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు నుండి కూడా విముక్తి లభిస్తుంది.

లావెండర్ నూనె మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. నీ తలనొప్పితో బాధపడేవారు లావెండర్ నూనెతో తలకు బాగా మసాజ్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అయి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. లావెండర్ నూనె నుండి వచ్చే పరిమళాలు శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మైగ్రేన్ తలనొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది.