తిన్న వెంటనే టాయిలెట్ కు పరుగులు పెడుతున్నారా… ఆలోచించాల్సిన విషయమేనండోయ్!

సాధారణంగా ప్రతిరోజు మన రోజువారి దినచర్యలలో భాగంగా ఉదయం లేవగానే టాయిలెట్ పెట్టడం అనేది రోజువారి చర్యలలో భాగమే. ఇలా ఉదయమే మలమూత్ర విసర్జనకు వెళ్లడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటామని నిపుణులు చెబుతారు అయితే చాలామంది రోజులు ఎక్కువ భాగం టాయిలెట్ వెళ్తూ ఉంటారు ముఖ్యంగా చాలామంది భోజనం చేసినటువంటి కొన్ని నిమిషాలకే టాయిలెట్లోకి పరుగులు పెడుతుంటారు ఇలా భోజనం తర్వాత పరుగులు పెడుతున్నారు అంటే ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

భోజనం చేసిన తర్వాత మీరు వెంటనే మలమూత్ర విసర్జనకు వెళ్లారు అంటే మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం ఇలా రోజుకు మూడుసార్లు తిన్నప్పుడు మూడు సార్లు కూడా టాయిలెట్ కు వెళ్లారు అంటే దానిని డేంజర్ బెల్ గా పరిగణిస్తారు. ఇలా తిన్న వెంటనే టాయిలెట్ కు వెళ్లడం వల్ల పేగు కదలికలు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల సంభవిస్తాయి. మీ జీవన శైలి సరిగా లేకపోతే గ్యాస్ట్రోకోలిక్ సమస్య వస్తుంది.

ఇలాంటి సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కారణాలు చాలానే ఉన్నాయి. వైద్యుల ప్రకారం, ఎక్కువ ఆత్రుతగా, ఒత్తిడికి గురయ్యే వ్యక్తులలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మనం ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు ఉంటుంది. అలాగే మన పనిలో అధిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇలా మన జీవన శైలిలో మార్పులు చోటుచేసుకుని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ కాస్త ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనకంటూ కాస్త సమయం కేటాయించి వ్యాయామం నడక వంటివి పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.