Devotional Tips: సాధారణంగా ఒక కుటుంబం అన్న తర్వాత ఆ కుటుంబంలో ఎన్నో సుఖ సంతోషాలతో పాటు ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ విధంగా చాలా మందిని వెంటాడే సమస్యలలో ఆర్థిక సమస్యలు ఒకటి. ఈ విధంగా ఆర్థిక సమస్యలతో చాలామంది సతమతమవుతుంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నో పరిహారాలను వెతుకుతారు. ఇలా చేసే పరిహారాలలో చంద్రుడికి నైవేద్యం సమర్పించడం ఒకటి.
మన ఇంట్లో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అష్టమి నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు సాయంత్రం చంద్రుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.ప్రతిరోజు సాయంత్రం అన్నం చేసిన వెంటనే ఎవరూ తినకుండా మొదటగా అన్నం పెరుగు కలిపి కిటికీలోనుంచి లేదా మేడ పైకి వెళ్లి తూర్పుదిశగా మల్లి చంద్రుడికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇక పౌర్ణమి రోజు ఎక్కువ మొత్తంలో పెరుగన్నం చేసి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నైవేద్యంగా సమర్పించిన పెరుగన్నం ప్రసాదంగా ఇతరులకు పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఆ చంద్రుని ఆశీస్సులు మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక సమస్యలను తొలగిస్తారు. తప్పనిసరిగా అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడికి ఈ నైవేద్యం సమర్పించడం ఎంతో మంచిదనీ వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు