ఏపీ హైకోర్టుని మూసేయబోతున్నారా..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

High Court Andhra Pradesh Telugu Rajyam

 గత కొద్దీ రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక వాటికి హైకోర్టు అడ్డుతగలటంతో వైసీపీలో కోర్టు తీర్పుల పట్ల ఒక రకమైన అసహనం కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పులను కించపరిచే విధంగా అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

High Court Andhra Pradesh Telugu Rajyam

 

 న్యాయ వ్యవస్థ పరువును దిగజార్చటాన్ని సహించేది లేదని, హైకోర్టును అపకీర్తి పాలుజేస్తూ పెడుతున్న పోస్టులు వెనుక ఏమైనా కుట్రకోణం దాగుందో లేదో నిజానిజాలు నిగ్గుతేలుస్తామని, సాధారణంగా ఎవరి ప్రవేయం లేకుండా న్యాయమూర్తుల గురించి తప్పుగా ఎవరు మాట్లాడరు, ఒక వేళా మీకు హైకోర్టు మీద నమ్మకం లేకపోతే పార్లమెంట్ కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు హైకోర్టు అవసరం లేదని చెప్పి మూసేయమనండి అంటూ హైకోర్టు మండిపడింది. ఆంధ్ర ప్రదేశ్ లో చట్టబద్దమైన పాలనా లేదా..? రూల్ అఫ్ లా అమలు కావటం లేదా..? లేని పక్షంలో ఇతర ఇబంధనలు ప్రకారం మేము అధికారాలు వినియోగించవల్సి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు. న్యాయమూర్తులను అవమానిస్తూ పోస్టులు పెట్టటం అత్యంత హేమమైన చర్య, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని, ప్రజాస్వామయంలో ప్రతి ఒక్కరిని గౌరవించవల్సిన బాధ్యత అందరి మీద ఉందని, సోషల్ మీడియా వర్కింగ్ సైట్స్ లో ఇలాంటి పోస్టులు పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా సైట్స్ తరుపు న్యాయవాదులను హైకోర్టు సూచించింది.

  ఇదే క్రమంలో ప్రభుతంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ లు జరిగాయని, కానీ న్యాయవ్యవస్థ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారి గురించి CID కి పిర్యాదు చేసిన కానీ ఎలాంటి కేసులు నమోదుకాలేదని, అప్పటి హైకోర్టు ఇంచార్జి రిజిస్టర్ జనరల్ వేసిన వాజ్యం కూడా విచారణకు వచ్చింది. దీనిపై కూడా కోర్టు మాట్లాడుతూ ఈ విషయంలో CID ఎన్ని కేసులు నమోదు చేసింది, వాటి విచారణ ఎలా జరుగుతుందో కూడా పరిశీలిస్తామని చెప్పింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. గతంలో ఇందిరాగాందీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆ తర్వాత రాష్ట్రంలో రామారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళకి న్యాయస్థానాల నుండి ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కోర్టు లు వ్యతిరేకించటంతో, ప్రభుత్వానికి కోర్టుకు చిన్నపాటి యుద్ధమే జరిగేది, అయితే తర్వాత కాలంలో అవి మెల్ల మెల్ల సర్దుకోవటం ఆనవాయితీ.