Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక ఆహారం విషయంలోనే కాకుండా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం సమయానికి నిద్రపోకపోవటం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య గ్యాస్టిక్ ప్రాబ్లం. ఈ ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
చాలామందికి ఏ ఆహారం తీసుకోవాలన్న గ్యాస్ ప్రాబ్లం మొదలవుతుందేమో అన్న భయంతో ఎటువంటి ఆహారం తీసుకోవడానికి కూడా మొగ్గుచూపారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల గ్యాస్టిక్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ గ్యాస్టిక్ సమస్య తో ఇబ్బంది పడేవారు ఒక గ్లాసెడు మజ్జిగ తాగడం వల్ల తొందరగా ఆ సమస్య నుండి విముక్తి లభిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లు కూడా గ్యాస్ట్రిక్ సమస్య నుండి తొందరగా విముక్తినిస్తుంది.
సాధారణంగా అందరికీ భోజనం తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయటం వల్ల గ్యాస్టిక్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల భోజనం చేసిన వెంటనే కాకుండా పది నిమిషాల తర్వాత నీరు తాగటం మంచిది. అలాగే కే.వి రోజు వ్యాయామాలు చేయడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యను అదుపులో ఉంచవచ్చు. ప్రతిరోజు అరగంట సేపు వ్యాయామం చేయటం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరిగి గ్యాస్టిక్ సమస్య తగ్గుతుంది.
శరీరంలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల కూడా గ్యాస్టిక్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పని ఒత్తిడి వల్ల సరిగా నిద్రపోకపోవటంతో తిన్న ఆహారం జీర్ణం కాకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. అందువల్ల సమయానికి ఆహారం తీసుకుంటూ నిద్ర పోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.