వ్యాయామాలు చేసిన వెంటనే నీరు తాగుతున్నారా… ఈ ప్రమాదంలో పడినట్టే?

మానవుడు జీవించడానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. ఒకరోజు ఆహారపు లేకపోయినా జీవించవచ్చు కానీ నీరు తాగకపోతే మాత్రం శరీరం డీహైడ్రేషన్ బారిన పడి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. వేసవికాలం శీతాకాలం అంటూ కాలాలతో సంబంధం లేకుండా ప్రతి సీజన్లోనూ నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. మానవుడు ఒక రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. లేదంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి, వెన్నునొప్పి, గుండెల్లో మంట, నీరసం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. నీరు మన జీవన విధానంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని సందర్భాలలో నీటిని తాగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ మీద శ్రద్ద పెరిగి చాలామంది జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయినా శారీరక శ్రమ చేసినప్పుడు మన శరీరంలో ఉన్న నీటి శాతం చెమట రూపంలో బయటికి పోతుంది. అందువల్ల మనకు ఎక్కువ దాహం వేస్తుంది. ఇలా వ్యాయామాలు కానీ ఇతర శారీరక శ్రమ చేసినప్పుడు వెంటనే ఒకేసారి ఊపిరి పీల్చకుండా నీరు తాగడం ప్రాణాలకే ప్రమాదం. వ్యాయామాలు చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాయామాలు చేసిన వెంటనే నీటిని తాగటం వల్ల మన శరీరంలోని అవయవాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. అయితే వ్యాయామాలు చేసిన తర్వాత నీరు తాగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జిమ్ లో వ్యాయామాలు చేసిన వెంటనే నీరు తాగకూడదు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత మన శరీరం నుండి బయటికి వచ్చిన చెమట పూర్తిగా తొలగిపోయిన తర్వాత నీరు తాగాలి. అంతేకాకుండా ఊపిరి పీల్చుకోకుండా ఒకేసారి ఎక్కువ మోతాదులో నీరు తాగటం వల్ల కూడా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా నీటిని కొన్ని కొన్ని తాగుతూ ఉండాలి. మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లడం వల్ల మన శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ చెమట రూపంలో బయటకి పోతాయి. అయితే వ్యాయామాలు చేసిన తర్వాత మనం తీసుకునే నీటిలో కొంచెం పంచదార ఉప్పు కలుపుకొని రూమ్ టెంపరేచర్ ఉన్న నీటిని తాగటంవల్ల తిరిగి ఎలక్ట్రోలైట్స్ శరీరానికి అందుతాయి. సాధారణంగా వ్యాయామాలు చేసిన వెంటనే చాలామంది చల్లటి మీరు తాగుతూ ఉంటారు అలా చేయడం చాలా పెద్ద పొరపాటు. వ్యాయామాలు చేసేవారు చల్లటి నీటిని తాగాలి అనుకున్నప్పుడు ఒకటి లేదా రెండు గంటల తర్వాత చల్లాటి నీటిని ఆగాలి.