లైగర్ సినిమా ఫ్లాప్ వెనుక ఆ హీరో ఫ్యాన్స్ ఉన్నారా?

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని విజయ్ దేవరకొండ తాజాగా వచ్చిన ”లైగర్’ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో కూడా తన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, ఈ సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అవుతానని ధీమా వ్యక్తం చేసాడు. అలాగే పూరి జగన్నాధ్, ఛార్మి కూడా ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారు. అయితే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అత్యంత ఘోర పరాజయం పొందింది. ఇంకో రెండు, మూడు రోజుల్లో థియేటర్ లో నుండి తీసేసిన ఆశ్చర్యం లేదు.

అయితే లైగర్ ఫ్లాప్ వెనుక ఒక హీరో అభిమానులు ఉన్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో సినిమా కు ఫ్లాప్ టాక్ వచ్చింది. అప్పుడు ఛార్మి ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో నవ్వుతున్న ఎమోజీలు ఉన్నాయి.

అయితే స్టార్ హీరో సినిమా ఫ్లాప్ కావడం వల్లే ఛార్మి అలా చేసిందని కామెంట్లు వినిపించాయి.ఇప్పుడు ఆ స్టార్ హీరో అభిమానులు ఛార్మి ట్వీట్ ను షేర్ చేస్తూ నవ్ ఇట్ ఈజ్ యువర్ టర్న్ అని టార్గెట్ చేస్తున్నారు.

‘లైగర్’ సినిమా ఫ్లాప్ కావడానికి  కారణం స్టోరీ సరిగ్గా లేకపోవడం.  ఈ సినిమా ప్లాప్ కి ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కారణం కాకపోయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం వెనుక మాత్రం ఆ స్టార్ హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు పూరి, విజయ్ ‘జనగణమన’ సినిమా మీద అనుమానాలు మొదలయ్యాయి.