ఆ రెండింటినీ తప్ప అన్నింటినీ రీప్లేస్ చేయవచ్చు.. వైరల్ అవుతున్న పూరి మరో మ్యూజింగ్!

డబల్ ఇస్మార్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ కొత్త సినిమా అప్డేట్స్ ఏవి బయటికి రాలేదు కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఖాళీగా లేడు అతని యూట్యూబ్ ఛానల్ లో పూరి మ్యూజిక్స్ పేరుతో అనేక రకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ మ్యూజింగ్స్ కి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అతను కొన్ని అంశాల మీద ఇచ్చిన మ్యూజింగ్స్ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు రీప్లేసబుల్ అనే అంశంతో మళ్లీ మన ముందుకు వచ్చాడు పూరి. ఒక వ్యవస్థ ఒక బంధం ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకటి తో రీప్లేస్ చేయవచ్చు. నేను లేకపోతే ఈ కంపెనీ, ఆఫీస్, ఇల్లు, రాష్ట్రం ఏమైపోతుందో అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఎలాంటి నష్టము జరగదు అవి మామూలుగానే నడుస్తాయి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పని చేసిన కంపెనీలో రిటైర్మెంట్ రోజు ఎంతో భావోద్వేగానికి గురై మీరు సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ ఉంటారు.

అయితే అదే సమయంలో మీ యాక్సిస్ కార్డు ఇంకొకడు డి ఆక్టివేట్ చేస్తూ ఉంటాడు, మరొకడు మీ అఫీషియల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ని మార్చేస్తారు, ఇంతలో ఆఫీస్ బాయ్ మీ డెస్క్ ని ఖాళీ చేసి మీ వస్తువులని కారులో పెట్టేస్తాడు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చునేవాడు బాధగా మీ స్పీచ్ వింటూనే స్పీచ్ అయిపోగానే ఒక పెగ్గు వేద్దామని చూస్తూ ఉంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు.

రిటైర్మెంట్ తర్వాత ఆఫీస్ నుంచి మీ సలహాలు కోసం ఎవరో వస్తారని ఆశించకండి. వాడికి కావాలంటే చాట్ జిపిటిని అడుగుతాడు. రిటైర్మెంట్ తర్వాత మిగిలిన జీవితం హాయిగా గడపండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, కొత్త నైపుణ్యాలని నేర్చుకోండి. డబ్బు, విజయం, పవర్ జీవితం చివరి వరకు ఉండవు, అవి లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోండి. ఈ లోకంలో అమ్మ, ఆమె చేసిన వంట తప్ప మిగతా వాటన్నింటినీ మార్చవచ్చు అంటున్నాడు పూరి.