రిలేషన్ లో ఎదుటి వ్యక్తి కూడా నిజాయితీగా ఉండాలంటున్న అనన్య పాండే.. కామెంట్స్ అతని గురించేనా!

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే ఈమధ్య ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కెరియర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న బాధల గురించి, పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. కెరియర్ ఆరంభంలో ఎంతో నెగిటివిటీని ఎదుర్కొన్నాను, ఎన్నో విమర్శలు చవి చూసాను వాటి వల్ల తీవ్రంగా బాధపడ్డాను. ఆత్మవిశ్వాసం కోల్పోయి కుంగుబాటుకి లోనయ్యాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయేదాన్ని.

సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ఆ సమయంలో మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు కానీ కొంతకాలం తర్వాత అవే కామెంట్స్ మనకి గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి అందుకే నేను థెరపీ తీసుకున్నాను. దానివల్ల నా ఆలోచన విధానం మెరుగుపడిందని చెప్పుకొచ్చింది అనన్య పాండే. అలాగే రిలేషన్ షిప్ గురించి కూడా మాట్లాడుతూ తాను గతంలో రిలేషన్షిప్ లో ఉన్నానని రిలేషన్ షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది.

మనం మారుతున్నామని విషయం మొదట్లో మనకి అర్థం కాదు అలాగే ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు బంధం నుంచి బయటపడినప్పుడే మీకు అన్ని అర్థమవుతాయని చెప్పుకొచ్చింది. రిలేషన్ షిప్ లో తాను నిజాయితీగా ఉంటానని ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే నిజాయితీ లభిస్తే బాగుంటుందని చెప్పారు. అయితే అనన్య పాండే గతంలో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఇద్దరికీ రిలేషన్ బెడిసి కొట్టిందని వార్తలు వచ్చాయి. దీంతో అనన్య పాండే మాట్లాడింది ఆదిత్య రాయ్ కపూర్ గురించేనా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే అనన్య పాండే తెలుగులో లైగర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వటంతో అనన్య తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చేరువ కాలేకపోయింది.