రోజు ఒక కివి పండు తినటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం?

ప్రస్తుతం వర్షాకాలం మొదలై అనేక సీజనల్ వ్యాధులను వెంటబెట్టుకొని వచ్చింది. ఈ వర్షాకాలంలో వ్యాప్తి చెందే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సీజనల్ వ్యాధుల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందువల్ల మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినటం చాలా అవసరం. అందువల్ల వర్షాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే కివి పండు తినటం కూడా చాలా అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఒక కివి పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.

కివి పండులో అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ ,విటమిన్ సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, కెరోటినాయిడ్స్ కూడా కివిలో పుష్కలంగా ఉన్నాయి. కివి పండులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కివి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. అందువల్ల ప్రతీరోజూ ఒక కివి పండ్లు తినమని డాక్టర్లు సూచిస్తున్నారు.

కివి పండు తినటం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కివిలో షుగర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ప్రతీరోజూ కివి పండ్లు తినవచ్చు.
కివిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జిందగీ మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను నివారిస్తుంది. కివి పండులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి ఫైటోకెమికల్స్ శరీరానికి కావలసిన ఐరన్ అందించి ఇది రక్తంలో ఆక్సీజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కంటి చూపు మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.