Vastu Tips For Marriage: సాధారణంగా చాలా మంది యువతీ యువకులకు వయస్సు పెరుగుతున్నా పెళ్లి సంబంధాలు కుదరక ఎంతో సతమతమవుతారు. ఈ విధంగా ఎంతో మంది యువతీ యువకులు పెళ్లి కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ పూజలు చేస్తుంటారు. ఇలా ఎన్ని పూజలు వ్రతాలు చేసిన వివాహ మాత్రం జరగదు. అయితే ఇలా మాటకి వివాహానికి ఏదో ఒక అడ్డంకులు రావడం పెళ్లి సంబంధాలు కుదరని వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఈ విధమైనటువంటి దోషాలు తొలగిపోయి తొందరగా వివాహ గడియలు దగ్గరకు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పెళ్లి కాని యువతి యువకుల పడకగదిలో ఎన్నో వాస్తు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. పెళ్లి కానీ యువతి నైరుతిదిశలో కాకుండా వాయువ్య దిశలో నిద్ర పోవాలి. అదేవిధంగా పెళ్లి కానీ యువకుడు ఆగ్నేయ దిశలో కాకుండా ఈశాన్య దిశలో నిద్రపోవాలి. అదేవిధంగా పడకగదిలో ఎల్లప్పుడు లేత రంగులను ఉపయోగించడం వల్ల గది మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహం చేసుకోవాలనుకునే యువతీయువకులు మంచం కింద ఎలాంటి పరిస్థితులలో కూడా ఇనుప వస్తువులను ఉంచకూడదు. ఈ విధంగా ఇనుప వస్తువులను ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
ఇక పెళ్లికాని యువతీ యువకులు దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి.ఈ విధంగా పెళ్లి కాని వారు ఎక్కువగా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. నలుపు రంగు దుస్తులు శని, రాహువు, కేతువులను సూచిస్తుంది. ఈ రంగు నిరాశకు చిహ్నంగా ఉంటుంది. అందుకే పెళ్లి కానీయువతీ యువకులు వీలైనంతవరకు ఎరుపు పసుపు పచ్చ ఆకుపచ్చ రంగులను ధరించడం వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది. అలాగే ఇంటి మధ్యలో బరువయిన వస్తువులను ఉంచడం సరైనది కాదు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇవి వివాహానికి అడ్డంకిగా మారుతుంది.