Cloth Mask: క్లాత్ మాస్క్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

Cloth Mask: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ ప్రజలకు హెచ్చరికలను జారీ చేస్తోంది.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. 2 డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ మాస్క్ ఉపయోగించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని తెలియజేస్తున్నారు.

కరోనా వేరియంట్ ను అడ్డుకోవడానికి మాస్క్ ప్రధాన ఆయుధం అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళిన ప్రతి సారి తప్పనిసరిగా మాస్క్ వేసుకోవడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు అయితే ఈ మాస్క్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలామంది క్లాత్ మాస్క్ లను ఉపయోగిస్తూ ఉంటారు ఇలా క్లాస్ మాస్క్ ఉపయోగించే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. కరోనా మొదటి దశలో ఉన్నప్పుడు క్లాత్ మాస్క్ మనకు రక్షణ కల్పిస్తాయని చెప్పిన ఆరోగ్య శాఖ ఒమిక్రాన్ వేరియంట్ ను క్లాత్ మాస్క్ ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదని తెలిపారు.

తులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని మైక్రోబయాలజిస్ట్ చాడ్ రాయ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్ ను అడ్డుకోవడానికి క్లాత్ మాస్క్ ఏమాత్రం సురక్షితం కాదని అందుకే ప్రతి ఒక్కరు క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్, కాకుండా 95 మాస్క్ ఉపయోగించినప్పుడే పూర్తి సురక్షితంగా ఉండగలమని తెలియజేశారు.