ఓవైపు కరోనా మహమ్మారి భయం. ఎక్కడ నుంచి ఏ రూపంలో వచ్చి అంటుకుంటుందోనన్న భయం. గడప దాటకపోయినా ఆ ఉపద్రవం ఎలా చుట్టేస్తోందన్న టెన్షన్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం ఎలా ముంచుకొస్తుందోనన్న ఆందోళనతోనే కొన్ని రోజులుగా బ్రతుకు బండి లాంగిచాల్సి వస్తోంది. తాజాగా నిన్న ఒకే రోజు (గురువారం) దేశ వ్యాప్తంగా వేర్వేరు చోట్లు ఏకంగా ఐదు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజల్ని మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ప్రకృతి ప్రకోపం ఏ రూపంలో ఉంటుందో ఊహించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్న విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ విస్పోటనం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఆ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు.
వందలాది మంది అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో వైద్యంపొందుతున్నారు. భోపాల్ గ్యాస్ ఘటన తర్వాత భారతదేశంలో అతి పెద్ద రసాయన విస్పోటనం ఇదే కావడం విశేషం. అలాగే తమిళనాడు, మహరాష్ర్ట లో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విశాఖ ఘటన జరిగిన కొన్ని గంటలకే చత్తీస్ ఘడ్ లోనూ గ్యాస్ లీకేజీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. రాయ్ గడ్ లో ఓ పేపేరు కంపెనీలో కెమికల్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా..అనుకోకుండా గ్యాస్ లీకైంది. దీంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్ని హుటా హుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని సమాచారం. అలాగే తమిళనాడులోని కడలూరు కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ ప్లాంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్లాంట్ నుంచి భారీ ఎత్తున పొగ ఎగసి భయటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదే రాష్ర్టంలో తిరువూరు లోని స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మహరాష్ర్టలోని ఓ కలప మిల్లులోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగసి పడటంతో కోట్లలో నష్టం వాటిల్లింది. ఇలా గురువారం ఒక్కరోజే దేశంలో వేర్వేరు చోట్లు భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నేడు ఔరంగాబాద్ లో జరిగిన రైలు ప్రమాదం కారణంగా 17 మంది మృత్యు వాతపడ్డారు.
ఇలా కారాణాలు ఏవైనా మానవ మనుగడైతే రానురాను ప్రమాదకర పరిస్థితుల్లోనే పడిపోతుంది. దీన్ని మానవ తప్పిందగా చెప్పాలా? సాంకేతిక లోపంతో కూడిన ప్రకృతి విపత్తులాంటిదా? అంటే నిపుణులు అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక జ్యోతిష్యులు అయితే యుగాంతానికి ఇవన్నీ సంకేతాలు అంటూ హెచ్చరిస్తున్నారు. ఆ మాటలు విన్న ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే 2020 గానీ 2022 లో గానీ యుగాతం అంటూ సోషల్ మీడియా లో రెండు..మూడేళ్లగా చిలవలు ఫలవులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రపంచంలో చోటు చేసుకున్న సంఘటనలు చూస్తుంటే యుగాంతానికి ఇవన్నీ సంకేతాలు అంటూ మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి.