నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. నెలకు రూ.40 వేల వేతనంతో ఏపీలో ఉద్యోగాలు!

ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జిల్లాలో ఫిబ్రవరి నెల 1వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననుండగా నెలకు కనీసం 10,000 రూపాయల నుంచి గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని టాలెంట్ ఉన్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ వరకు చదువుకుని సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.

మొత్తం 18 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. అపోలో, అస్త్రో స్టీల్, డీమార్ట్ కంపెనీలతో పాటు టీవీఎస్ ట్రైనింగ్ సర్వీస్, ప్యూషన్ మైక్రో ఫైనాన్స్, అమర్ రాజా గ్రూప్, పేటీం మరికొన్ని కంపెనీలు సైతం ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా జరగనుందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ మేళాకు హాజరైతే మంచిదని చెప్పవచ్చు.

దేశంలోని నిరుద్యోగులలో చాలామంది సరైన జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ లు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకుని ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫార్మల్ డ్రెస్ లో ఈ ఇంటర్వ్యూకు జాజరు కావాల్సి ఉండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ మేళాకు హాజరయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.