ఐసిఐసిఐ లో చందా కొచ్చర్ ట్రావెల్ 8 పాయింట్స్ లో

ఐసిఐసిఐ బ్యాంక్  సిఇవొ  లో చందా కొచ్చర్ సక్సెస్ ఫుల్  బ్యాంకింగ్  స్థానం వివాదాస్పదంగా ముగిసింది. మొన్న మొన్నటి దాకా ఆమె దేశంలో ఒక మోస్టు సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపార వేత్త. అయితే ఆమె అంతే వివాదాస్పదంగా మారారు. అక్రమాలకు పాల్పడ్డారు. బ్యాంకు నిధుల వేలకోట్లలో పక్కదారుల్లోకి మళ్లించారు.అయిన వారికి అప్పులిచ్చారు. ఇవి బయటపడటంతో  ఆమె బ్యాంకు పదవులనుంచి తప్పుకున్నారు.

1. చందా కొచ్చర్ 1984 లో ఐసిఐసిఐ లో మేనేజ్మెంట్ ట్రెయినీగా కెరీర్ ప్రారంభించారు.

2. 2001 లో ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో స్థానం సంపాదించుకున్నారు.

3. 2006 నుండి 2007 మధ్య కాలంలో బ్యాంకు కార్పొరేట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యాపారాలకు సారధ్యం వహించారు.

4. 2007 నుండి 2009 వరకు బ్యాంకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించారు.

5. 2009 మేలో ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా బాధ్యతలు చేపట్టారు.

6. 2011 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం.

7. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో కొచ్చర్ కు వరుసగా ఏడేళ్లు స్థానం దక్కింది.

8. వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించే జాబితాలో వరుసగా ఐదుసార్లు చందా కొచ్చర్ కి స్థానం లభించింది.

 

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్