కాజల్ మాత్రమే కాకుండా భారతీయుడు 2 లో మరో స్టార్ హీరోయిన్?

కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా,శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 1996వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా వచ్చి దాదాపు పాతికేళ్ళు కావడమే కాకుండా ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయుడు 2 సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి.

దాదాపు కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు డైరెక్టర్ శంకర్ కి మనస్పర్ధలు రావడం చేత ఈ సినిమా పక్కకు వెళ్ళింది. లైకా ప్రొడక్షన్ ఏకంగా డైరెక్టర్ శంకర్ పై కేసు కూడా వేశారు.అయితే ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో తిరిగి ఈ సినిమాని సెప్టెంబర్ నెల నుంచి షూటింగ్ పనులు ప్రారంభించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శంకర్ రామ్ చరణ్ సినిమాను పక్కనపెట్టి భారతీయుడు 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో కేవలం కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా మరొక అగ్ర హీరోయిన్ కూడా నటిస్తోందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే నటి రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.