AP: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ వాలంటీర్లు….. క్యాబినెట్ కేంద్రంగా సరికొత్త వ్యూహం!

AP: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే ఐదు సంవత్సరాల పాటు వాలంటీర్ వ్యవస్థ ఎంతో విజయవంతంగా కొనసాగింది వాలంటీర్ సేవలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసించాయి అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇలా వాలంటీర్ వ్యవస్థ గురించి విమర్శించినటువంటి వీరిద్దరూ తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ప్రశంసలు కురిపించడమే కాకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తే కనుక వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగిస్తామని అదేవిధంగా వారికి గౌరవ వేతనం 10000 రూపాయలు పెంచుతామని తెలిపారు.

కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లను నియమిస్తూ ఎలాంటి జీవో విడుదల చేయలేదని తద్వారా వారిని కొనసాగించడం వీలు కాదని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేశారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూటమి నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటూ రోడ్లపైకి వచ్చారు.

ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇదివరకు బకాయిలు ఉన్నటువంటి వారందరికీ ఏపీ సర్కార్ పూర్తిస్థాయిలో బకాయిలను విడుదల చేశారు. ఇక తమకు కూడా రావాల్సిన జీతాలను చెల్లిస్తారని ఎంతో ఆశపడ్డాము అదే విధంగా వాలంటీ తను కొనసాగింపు పై సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్తను చెబుతారని వాలంటీర్లు ఆశగా ఎదురు చూశారు. ఇలా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 17వ తేదీ ఓ వినతిపత్రం తీసుకుని అమరావతిలో జరిగే క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది.

సీఎం చంద్రబాబుకు ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలంటూ ఓ వినతిపత్రం సమర్పిస్తామని వాలంటీర్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా సీఎంను కలిసేందుకు అమరావతి రాబోతున్నట్లు తెలిపారు.