దేశాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. వైరస్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు తెలుగు రాష్ర్టాల్లో మహమ్మారి విలయతావడం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వైద్యం అందించడంలో…పరీక్షలు చేయడం విఫలమైంది. ఇక జీహెచ్ ఎంసీలో ఫరిదిలో పరిస్థితి అయితే అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. రోగుల సంఖ్య అంతకంతకు పెరిగిపో తుంది. కరోనా ఇప్పుడు దాదాపు సీటీ అంతా వ్యాపించేసింది. ప్రతీ కాలనీలో ఒక్కో కేసు ఉందని అంటున్నారు. ప్రభుత్వ డాక్టర్లు దగ్గరకు వెళ్లినా వైద్యం అంతంత మాత్రంగానే ఉందని ఇటీవల వెలువడిన కథనాల నేపథ్యంలో హోమ్ క్వారంటౌన్ లో ఉంటూనే జబ్బుని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీలో మరోసారి లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నోట నుంచి ఆ ప్రకటన ఏక్షణమైనా వచ్చే అవకాశం ఉంది. దీంతో గత మూడు రోజులుగా సీటీలో ఉన్న ఇతర రాష్ర్టాల వారంతా స్వరాష్ర్టాలకు, స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రహదారాలు వెంబడి ట్రాఫిక్ విపరీతంగా ఒక్కసారిగా పెరిగిపోయింద. ఇక టోల్ గేట్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ధ తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కేంద్ర అంతరాష్ర్ట ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదని చెప్పినా…రాష్ర్టాలు ఈపాస్ లు కావాల్సిందేనని వాహనదారులపై పడుతున్నారు.
దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కొంత మంది అనుమతులు, మరికొంత మంది అనుమతుల లేకుండా ప్రయాణం మొదలు పెట్టారు. అనుమతులున్న వారి రక్తనమూ నాలను సేకరించి పంపిస్తున్నారు. లేని వారిని తిరిగి వెనక్కి పంపిచేస్తున్నారు. భారీగా వాహనాలు రావడంతో ట్రాపిక్ అంతరాయం ఏర్పడుతుంది. అటు సమీప ప్రాంతాల వారు గుంపులు గుంపులుగా నడక దారి పడుతున్నారు. ఇలా అంతా కలిసి ముకుమ్మడిగా పోలీసులపై పడుతున్నారు. పంపించండి..వదిలేయండా..మాకు ఎలాంటి వైరస్ లేదంటూ మొత్తుకుంటున్నారు. మరికొంత మంది పోలీసుల కళ్లు గప్పి దొడ్డి దారిన చెక్ పోస్ట్ ను దాటే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసుల కంట్లో పడితే వాళ్లను ఎత్తుకుని తీసుకొచ్చి తెలంగాణ బోర్డర్ లో పడేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. ఈ సన్నివేశాలన్నీ చస్తుంటే హాలీవుడ్ సినిమా వరల్డ్ వార్ జీ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని తలపిస్తున్నాయి. ఆ సినిమాలో వైరస్ సోకి జోంబీ రూపంలోకి మారిపోయిన వారి నుంచి రక్షించుకోవడాని వైరస్ సోకని జనం ఎలా పరుగులు తీస్తారో? ఏపీ-తెలంగాణ బోర్డర్ వద్ద అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బోర్డర్ కు చేరుకున్న వారిలో ఎవరికి కరోనా ఉందో? ఎవరి కి లేదో? అర్ధంకావడం లేదు. గుంపులు గుంపులుగా వచ్చిన వారి నుంచి దూరంగా జరగడానికి మిగతా జనం పరుగులు తీస్తున్నారు.