Lokesh: ఏపీ మంత్రి తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాతయ్యకు నివాళులు అర్పించారు. అనంతరం ఈయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మీడియా వారి నుంచి నారా లోకేష్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.
ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ క్షమాపణలు చెప్పడమే కాకుండా టిటిడి పాలకమండలి సభ్యులు కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం గురించి మీడియా వారు నారా లోకేష్ ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లోకేష్ ఊహించని సమాధానం చెప్పారు.
పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పడం అలాగే టిటిడి పాలక మండలికి క్షమాపణలు చెప్పాలని కోరడం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని ఈ వ్యాఖ్యలతో మా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదని లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి . ఇలా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు జనసేన నేతలలోనూ కార్యకర్తలలోనూ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి టోకెన్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇలా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోగా 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందిస్తూ పూర్తి బాధ్యత అధికారులదేనని అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా టిటిడి పాలక మండలి సభ్యులు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో వారు కూడా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.