రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన స్పీకర్ పదవిలో ఉనన తమ్మినేని సీతారాం మరోసారి కఠినంగా స్పందించారు. అధికారుల తీరు కారణంగా ఈ మేరకు మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మైనింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇకపై కూడా పద్ధతి మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి రావొచ్చని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం స్థానికులు తరలిస్తున్న ఇసుకకు కూడా అడ్డంకులు ఇక మీద కూడా సృష్టిస్తే తలుపులు మూయాల్సి రావొచ్చని తనదైన ఉత్తరాంధ్ర స్టైల్ లో హెచ్చరించారు.
గ్రామ పంచాయతీ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కోసం తరలిస్తున్న ఇసుకను అడ్డుకుంటూ కేసు పేరుతో వేధిస్తున్నారని తప్పుపట్టారు. చివరకు ఎడ్లబండ్లపై కొద్ది పాటి ఇసుకను తీసుకెళ్తున్న వాళ్లు అనుమతి పత్రాలు చూపించినా అధికారులు కనికరించడం లేదని ఆరోపించారు. ఇలాంటి వారిపై కూడా కొరఢా ఝుళిపిస్తూ కేసుపు పెడుతున్నారని తప్పుపట్టారు. ఎన్నిసార్లు సూచించినా తీరు మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగిస్తే అధికారులను అందర్ని పిలిచి తలుపు మూయాల్సి వస్తుందని తనదైన ఉత్తరాంధ్ర స్టైల్లో హెచ్చరించారు.
స్పీకర్ పదవిలో ఉన్న తాను తాను ఇలా మాట్లాడొద్దని తెలిసినా…. పరిస్థితులు చేజారిపోతున్న కారణంగా ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. పాలనాపరంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదని, ఎక్కడో చోట చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని స్పీకర్ వ్యాఖ్యానించారు. కింది స్థాయిలో శాఖల పరంగా జరుగుతున్న.. ఓవరాక్షన్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.