మరొక లేటెస్ట్ అస్త్రం తో దిగుతున్న తమ్మినేని .. చంద్రబాబు కి మామూలు టార్చర్ కాదింక !

tammineni cbn

 అసెంబ్లీ సమావేశాలు అంటే మాములుగా అధికారపక్షము మరియు ప్రతిపక్షము మధ్య హోరాహోరీ మాటల యుద్ధం జరుగుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే ప్రతిపక్షము వర్సెస్ స్పీకర్ అన్నట్లు సాగుతుంది. అసెంబ్లీలో స్పీకర్ అనే వ్యక్తి అధికారపక్ష నేతలకు, ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇస్తూ, ఇరు వర్గాలను సమన్వయం చేసుకుంటూ,సభను సాధ్యమైనంత వరకు రాజ్యాంగ బద్దంగా నడిపించటానికి తనవంతు సహకారం చేస్తుంటాడు. స్పీకర్ పోస్ట్ రాజ్యాంగ పదవి కాబట్టి ఆ పదవిలో కూర్చున్న వ్యక్తి రాజకీయ పరంగా , పార్టీ పరంగా వ్యవహరించటానికి లేదు.

tammineni vs chandrababu

 గత మూడు రోజులు నుండి జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే చంద్రబాబుకు, స్పీకర్ తమ్మినేనికి మధ్య మాటలు యుద్ధం నడిచింది. ఒకరి మీద మరొకరు పేపర్లు విసురుకునే పరిస్థితి వచ్చింది. గతంలో టీడీపీ లోనే పనిచేసిన తమ్మినేని ఇప్పుడు అదే పార్టీ అధినేతతో స్పీకర్ స్థానంలో ఉంది నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా పరిస్థితిలు మారిపోయాయి. సీనియర్ నేత కాంగ్రెస్ వృద్ధ నేత బొడ్డేపల్లి రాజగోపలారావునాయుడుని యువకుడిగా ఉన్నపుడే ఓడించి మరీ 1983లో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు తమ్మినేని సీతారాం.

 శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన తమ్మినేనికి ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. అప్పట్లో కింజారాపు ఎర్రన్నాయుడు చంద్రబాబు వర్గంలో పనిచేసేవాడు. ఆ తర్వాత పార్టీ ఎన్టీఆర్ చేతిలో నుండి బాబు చేతిలోకి రావటంతో కింజారాపు ఫ్యామిలీ మీద అవ్యాజమైన ప్రేమతో తమ్మినేనిని బాబు రాజకీయంగా తొక్కడం ప్రారంభించారని అంటారు. మొత్తానికి అది తమ్మినేని పార్టీ నుంచి బయటకు పోయేలా చేసింది.ఎటూ కాకుండా పోతారనుకున్న తమ్మినేని ఇలా గెలిచి స్పీకర్ గా రావడం, అధ్యక్షా అంటూ చంద్రబాబు ఆయన ముందే నిలబడాల్సిరావడం రాజకీయ విచిత్రమే.

 తమ్మినేని రాజకీయాలలోకి రాకముందు వెయిట్ లిఫ్టర్. ఆయన దూకుడు రాజకీయం చేస్తారని పేరు. అదే దూకుడును స్పీకర్ పదవిలో ఉన్నకాని తమ్మినేని చూపిస్తుంటాడు. స్పీకర్ పదవిలో తమ్మినేని లాంటి నేత ఉండటంతో చంద్రబాబు పప్పులు అసెంబ్లీ లో ఉడకటంలేదు. దీనితో బాబులో అసహనం పెరిగిపోయింది. కావాలనే తమ్మినేని తనకు మైక్ ఇవ్వడంలేదని అందరి చేత తిట్టిస్తున్నారని బాబు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు.