అమరావతి భూకుంభకోణం గురించి వివిధ చానెళ్లలో వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయా వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం స్పందించారు.
దానికి సంబంధించి కీలక ప్రెస్ మీట్ ను ఆయన విజయవాడలో ఏర్పాటు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని చానెళ్లలో వస్తున్న ప్రచారానికి ఆపడం కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన వెల్లడించారు.
అమరావతి భూకుంభకోణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇఛ్చిన జీవోపై హైకోర్ట్ జడ్జి సోమయాజులు స్టే ఇచ్చారని.. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో ఏపీ హైకోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చిందని.. మరోవైపు ఈ కేసుల్లో సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు.
అందుకే.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ.. సుప్రీం చీఫ్ జస్టిస్ కు అందించినట్టు ఆయన తెలిపారు. ఈనెల 8న అందించినట్టు అజేయ కల్లం స్పష్టం చేశారు.
అమరావతి భూకుంభకోణం కేసుల్లో సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 6న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సీఎం వైయస్ జగన్ లేఖ అందించారు- ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం#AmaravathiScam
— YSR Congress Party (@YSRCParty) October 10, 2020