ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవలయాలపై దాడులు జగరడం అనే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బిట్రగుంటలో ఓ రధం, అంతర్వేదిలో ఇంకో రధం తగలబడింది. అలాగే పిఠాపురంలో దేవతా మూర్తుల విగ్రహాలు తగలబడ్డాయి. ఇంకో చోట ఆంజనేయ స్వామి విగ్రహం పగిలిపోవడం ఇలా వరుసగా హిందూ దేవలయాలపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులపై వైసీపీ నాయకులు ఇస్తున్న వివరణలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
వైసీపీ నాయకుల వాదన
బిట్రగుంటలో రథంను ఒక పిచ్చి వాడు తగలబెట్టటాడని, అంతర్వేదిలోని రథం తేనె పట్టు కోసం ప్రయత్నిస్తుండగా తగలబడిందని, పిఠాపురంలో దేవతా మూర్తుల విగ్రహాలును ఒక ఆకతాయి తగలబెట్టాడని వైసీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసమైతే ‘బొమ్మే కదా.. దేవుడికి వచ్చిన నష్టమేంటి?’ అని కొడాలి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇలా వివరణలు ఇస్తూనే సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో అన్ని మతాలకు న్యాయం జరగాలి కాబట్టి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనక ఉన్న వ్యక్తులను బయటకు తియ్యాలి. విచారణ పూర్తి కాకుండానే అధికార హోదాలో ఉన్న నాయకులు ఇలా వ్యాఖ్యలు చెయ్యడం తగదు. అంతర్వేది ఘటనలో ప్రభుత్వం సీబీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విచారణ ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.
డీజీపీ కూడా వైసీపీ మాటలే చెప్తున్నారే!
వైసీపీ నాయకులంటే ప్రత్యర్థుల నుండి వస్తున్న ఆరోపణలను ఎదో సమాధానం చెప్పాలి కాబట్టి ఇలాంటి అర్ధంపర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే ప్రజా సేవ చేయడానికి నియమించబడ్డ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా వైసీపీ నాయకుల పాటనే పాడుతుండటం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన కూడా విచారణ పూర్తి కాకుండానే ఆకతాయిలు చేశారని, పిచ్చి వాడు చేశాడని వ్యాఖ్యానించడం తగదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.