ఇసుక రీచ్ లన్నీ ఇక పై ఒకరికే – ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ క్యాబినెట్ ఇసుక పాలసీపై సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక పై ఒక్కో రీచ్ ను ఒక్కొక్కరికి అప్పగించే బదులు అన్నిరీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు కేబినెట్ ఆమోదించింది. కొత్త వివాదాలకు తావు ఏపీలోని ఇసుక రీచ్ లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని మొదట భావించినప్పటికీ సదరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆసక్తి కనబర్చకపోవడంత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చంది. ఓపెన్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్లను పిలిచి ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

మొదట్లో జగన్ సర్కారు ఇసుక వనరులపై పలు ఆంక్షలు విధించింది. కఠినమైన నిబంధనలు అమలు చేసింది. అయితే ఈ నిబంధనలతో మార్కెట్లో ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డాయి. బ్లాక్ లో ఇసుక కొనుక్కోవాల్సి వస్తోందని ఆరోపించాయి. అయితే ఇసుక దొపిడీని అడ్డుకునేందుకు ఏపీ సర్కారు తీసుకొచ్చిన కఠిన నిర్ణయాల వల్ల ఇసుక కొరత ఏర్పడి చాలా చోట్ల బ్లాక్ లో కొనుక్కోవాల్సి వచ్చింది. అయితే ఒకే సంస్థకు ఇసుక రీచ్ లన్నీ అప్పగించడం పై కూడా ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. అయితే టెండరింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగితే తప్ప ప్రతిపక్షాలు మిన్నకుండే అవకాశాలు కనిపించడం లేదు.