Rajinikanth: మీ మాటలు మనసుని తాకాయి.. చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్ చెప్పిన రజినీకాంత్!

Rajinikanth: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. ఒక సాధారణ బస్సు కండక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ అనుకోకుండా సినిమాలలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా రజనీకాంత్ సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు.

ఇలా ఐదు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలు చేసిన రజినీకాంత్ తాజాగా 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి కావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం రజనీకాంత్ కు అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు చేసిన పోస్ట్ ను రజినీకాంత్ రీ పోస్ట్ చేస్తూ..”మీ మాటలు నా హృదయాన్ని తాకాయి.. మీ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. మీ సందేశం నా మనసును హత్తుకోవడమే కాకుండా ఈ శుభాకాంక్షలు నాలో స్ఫూర్తి నింపాయి. మీ లాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో నేను సినిమా పరిశ్రమలో ఉత్తమంగా రాణించడానికి కృషిచేస్తాను” అంటూ ధన్యవాదాలు తెలిపారు.

ఆగస్టు 15 2025 నాటికి రజినీకాంత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ఫొటోను పంచుకొని ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్‌ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సందేశాలు కూడా ఇస్తారని కొనియాడారు. సామాజిక సమస్యలపై కూడా పలు చిత్రాలు తీశారని.. అవి ఎంతోమందిని కదిలించాయని తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రజనీకాంత్ కు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.