Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనం ఎప్పుడు చూసినా ఆయన ఒకే డ్రెస్ కోడ్ లోనే కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ లోనే చంద్రబాబు నాయుడు కనిపిస్తూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు అంటేనే ఎక్కువగా వైట్ అండ్ వైట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఉన్నతాధికారులను కలిసిన కూడా ఈయన మాత్రం తన వస్త్రధారణలో ఎలాంటి మార్పులు చేయరు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు కేవలం ఎల్లో కలర్ డ్రెస్ ధరించడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే ఆ డ్రెస్ ధరించడం వెనక పెద్ద రీజనే ఉందని చెప్పాలి. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పసుపు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుంది. పసుపు అంటేనే శుభ సూచకం మనం ఎలాంటి పూజలు చేసిన ఎలాంటి శుభకార్యాలు చేసిన ముందుగా పసుపుకు ప్రాధాన్యత ఇస్తాము. ఇలా ఇంత శుభ సూచకం కలిగినటువంటి పసుపు రంగు దుస్తులు ధరిస్తే అంతా మంచే జరుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తారట.
ఇక పసుపు బట్టలు ధరిస్తే ఎంతమందిలో ఉన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తారు. ఇలా రాజకీయ నాయకులు అందరూ కూడా తెలుపు రంగు దుస్తులలో కనిపించిన పసుపు రంగు దుస్తులు ధరించి అందరిలోనూ తాను ఎంతో స్పెషల్ అని నిరూపించుకుంటారు. ఇలా వంద మందిలో కూడా చంద్రబాబు నాయుడుని ఈజీగా మనం గుర్తించవచ్చు. ఇకపోతే చంద్రబాబు నాయుడు పార్టీ రంగు కూడా పసుపు రంగు కావడంతో అందుకు అనుగుణంగానే ఈయన ఇలాంటి పసుపు రంగు దుస్తులను ధరిస్తారని తెలుస్తుంది.