టెన్షన్‌లో ఏపీ సీఎం జగన్‌.. దీనికి కారణం ఆ మంత్రి గారు చేసిన పనేనటా.. ? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఒక వైపు పాలన పరమైన ఇబ్బందులు, మరో వైపు ప్రతిపక్షాలు పెట్టే చికాకులూ వీటన్నీంటిని చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సొంత పార్టీ నాయకుల నుండే కాకుండా, ఏపీ దేవాలయాల్లో జరిగిన కొన్ని సంఘటనలు కూడా తీవ్రమైన అసహనాన్ని కలిగించాయట.. ఇక అంతా సర్ధుకుంటుంది అని భావించిన సమయంలో మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. అదేమంటే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది..

ఈ మంత్రికి కరోనా వస్తే వైఎస్ జగన్‌కు టెన్షన్ ఎందుకంటారా.. ఎందుకంటే తాజాగా జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి, మంత్రి వెల్లంపల్లి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అదీగాక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే బసచేశారు.. అయితే ఈనెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్న ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా వెల్లంపల్లికి కరోనా నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటూ ఇతర మంత్రులు, అధికారుల్లో కూడా ఆందోళన కలుగుతోందట. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిందే..

ఇకపోతే రోజు రోజుకు ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చివరికి ఎవరి నుంచి కరోనా సోకుతుందో అర్ధం కానీ పరిస్థితులు నెలకొంటున్నాయి.. ఈ క్రమంలో పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజా ప్రతినిధులు కూడా ఈ మధ్య కరోనా బారిన పడుతున్నారు.. ఇక వైఎస్ జగన్ సర్కార్ కోవిడ్ విషయంలో ఏపీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు..