AP Minister Perni Nani : ప్రస్తుతం భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న భారీ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోస్ తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. అయితే ఇంత కస్టపడి తీసిన ఈ సినిమాకి ఏపీలో ఊహించని రీతి పరిస్థితి నెలకొంది.
కొత్త టికెట్ ధరలు పెంచడం తగ్గించడంపై కొన్నాళ్ల పాటు అలా సస్పెన్స్ నడిచి ఫైనల్ గా రాజమౌళి తన సినిమాకి ఏపీ ప్రభుత్వం నుంచి భారీ హైక్ ని తెచ్చుకున్నాడు. అయితే అసలు ఈ సినిమాకి ఎందుకు ఇంత హైక్ మరియు ఇతర పర్మిషన్స్ ఇస్తున్నారో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
వీరు కొత్త జివో లో సూపర్ బడ్జెట్ సినిమా అంటూ ఒక క్యాటగిరి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈ సినిమాకి హీరోల రెమ్యునరేషన్ కాకుండా టోటల్ గా 334 కోట్లు బడ్జెట్ అయ్యినట్టు అది కూడా జి ఎస్ టి లేకుండా అయ్యిందని వెల్లడి చేశారు. అందుకే ఈ సినిమాకి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని వెల్లడించారు.
ఈ రకంగా ఈ భారీ సినిమాకి హైక్ వచ్చిందని సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అలాగే ఏపీలో టికెట్ బుకింగ్స్ కి సంబంధించి గవర్నమెంట్ పోర్టల్ ని కూడా డిజైన్ చేస్తున్నామని దీనిని మే నాటికి సిద్ధం చేస్తామని కూడా చెప్పారు. మరి ఏపీలో ధరలు ఎలా ఉంటాయో ఇవన్నీ ఎప్పటికి సాధ్యపడతాయో చూడాలి.