Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైన విషయం మనకు తెలిసిందే. జనసేన పార్టీ నుంచి నాగబాబు పేరును ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నామినేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి అంటూ ఈయన పార్టీకి ఆదేశాలను జారీ చేశారు. ఇక నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికైన అనంతరం ఏపీ క్యాబినెట్లోకి కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారు అనే విషయం గురించి సర్వత్ర ఆసక్తి మొదలైంది. ఇక తాజాగా నాగబాబుకు ఇవ్వబోయే మంత్రి పదవికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. నాగబాబుకు క్రీడా శాఖను కేటాయించబోతున్నారని సమాచారం. ఇలా నాగబాబుకు కనుక క్రీడా శాఖ ఇస్తే మాజీ మంత్రి రోజా ఇబ్బందులలో పడుతుందని తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయామంలో రోజా టూరిజం అలాగే క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు . ఈమె క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా భారీ స్థాయిలో అవినీతి చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై కూటమి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగబాబు కనక క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖలో జరిగిన అవినీతి మొత్తం బయటపడబోతుందని తద్వారా మాజీ మంత్రి రోజుకు ఇబ్బందులు కూడా తప్పవని తెలుస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికిన రోజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది ఇక క్రీడా శాఖలో ఈమె అవినీతి బయటపడితే రోజాకు భారీ ఇబ్బందులు కలుగుతాయని తెలుస్తోంది.