Crime News: కర్నూలు లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది వి.వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 7వ తేదీ నుండి కనిపించకుండా పోయిన ఈయన ఈ రోజు ఉదయం కర్నూల్ శివార్లలోని పంట పొలాల వద్ద మృతదేహం కనిపించింది.
మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వెంకటేశ్వర్లు ను ఎవరైనా వేరేచోట హత్యచేసి, శవాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు కర్నూలులోని టెలికాం నగర్ లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు ఏప్రిల్ ఏడో తేదీన చింతకుంట లో నివాసం ఉండే తన తమ్ముడి ఇంటివద్దకి వెళ్లి తిరిగి వచ్చే సమయం లో కనిపించకుండా పోయాడు.
కనిపించకుండా పోయిన వెంకటేశ్వర్లు గురించి కుటుంబ సభ్యులు ఎంత గాలించినా కనిపించకపోవడంతో ఏప్రిల్ ఏడో తేదీన మహానంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనితో అక్కడ పోలీసులు వెంకటేశ్వర్ల మీద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈయన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కేసులను వాదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కేసులకు సంబంధించిన వారు ఎవరైనా ఈయనను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.