అన్నీ తిరిగి “బాహుబలి” కే ఎసరు పెట్టారా.?

ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. సినిమాల విషయాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాల్లో కలుగజేసుకుంటుండడం చాలామందికి ఇబ్బందికరంగానే ఉంటుంది అయినా కూడా సినీ పెద్దలు కూడా తమ శక్తి మేర మళ్ళీ మామూలు పరిస్థితులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు వాస్తవమే కానీ..

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన పలు చిత్రాలను ఏపీ ప్రభుత్వం వారు టార్గెట్ చేసారని టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అలానే సూపర్ స్టార్ మహేష్ నటించిన “సర్కారు వారి పాట”, అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాటిన “అల వైకుంఠపురములో” సినిమాలను కొన్ని కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి కట్టాలని డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్ బయటకి వచ్చింది.

ఇప్పుడు ఈ లిస్ట్ లో అన్నీ తిరిగి ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రం ‘బాహుబలి 2’ వసూళ్లకే ఎసరు పెట్టారట. ఈ సినిమా లెక్కలు కూడా చూడాలని 50 కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది అని ఓ టాక్ ఇప్పుడు మొదలయ్యింది. మరి వీటి పరంగా ఎంతమేర నిజం ఉందో కానీ ఇవన్నీ వింటూ మూవీ లవర్స్ బాగా విస్తుపోతున్నారు.