ఏపీ సీఎం వైఎస్ జగన్.. మిగితా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లా కాదు. ఆయన ఒక పథకాన్ని ప్రారంభిస్తే.. ఆ పథకం తాలుకు ఫలితం ఖచ్చితంగా లబ్ధిదారులకు చేరాల్సిందే. అందులోనూ ఆయన ప్రవేశపెట్టే పథకాలు ఇప్పటి వరకు దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టని పథకాలు. యువ ముఖ్యమంత్రి.. సరికొత్త ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇఫ్పటికే పేద మహిళల కోసం, ఏపీ పేద అక్కాచెల్లెళ్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, ఉపాధి పథకాలను ప్రారంభించిన సీఎం జగన్.. మరో ముందడుగు వేశారు.
రాష్ట్రంలోని పేద అక్కాచెల్లెళ్లకు ఇళ్ల స్థలాల రూపంలో 20 వేల కోట్ల రూపాయల ఆస్తిని పంపిణీ చేయబోతున్నారు. బహుశా.. ఇంత భారీ మొత్తం విలువ గల భూములను పేదలకు పంపిణీ చేయడం అనేది దేశంలోనే తొలిసారి.
పేద మహిళలకు 62 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే లబ్ధిదారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇళ్ల స్థలాల రూపంలో సుమారు 30 లక్షల మంది పేద మహిళలకు 62 వేల ఎకరాల ఇళ్ల స్థలాలను అందించేందుకు సమాయత్తం అవుతోంది.
62 వేల ఎకరాల ఇళ్ల స్థలాల సేకరకు ప్రభుతవం 6607 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈసారి పక్కాగా.. అక్కాచెల్లెళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అందివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. శాశ్వతంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా.. అక్కాచెల్లెళ్లకు పక్కాగా ఉండేలా ఇళ్ల స్థలాలను అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఇక.. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది బీసీలే ఉన్నట్టుగా తెలుస్తోంది. కులం, మతం, ప్రాంతం, పార్టీ.. అనే వాటిని చూడకుండా నిజమైన లబ్ధిదారులను.. వలంటీర్ల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు కోర్టులో ఉంది. న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పేద అక్కాచెల్లెళ్లందరికీ సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువైన 62 వేల ఎకరాలను ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.