YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మనకు తెలిసిందే .అయితే ఈయన గత ఎన్నికలలో ఓటమిపాలు అయిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. అది కూడా ఈయన అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి వెళ్లలేదు. కూటమి నేతలు అసెంబ్లీకి రావాలి అంటూ పిలుస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే వస్తానని చెబుతున్నారు.
అసెంబ్లీలో కనీసం 10 శాతం మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే వారికి ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తారు కానీ జగన్మహన్ రెడ్డికి కనీసం ఎమ్మెల్యేల బలం కూడా లేకపోవడంతో ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు లేవని చెప్పాలి. ఇలా అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 8 నెలలు అవుతుంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి వెళ్లకపోవడంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం గురించి సంచలన విషయాలు తెలిపారు.
ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న రఘురామకృష్ణ రాజును మీడియా వారు ప్రశ్నిస్తూ జగన్ మోహన్ రెడ్డి సభకు రాకపోవడం గురించి అడిగారు. ఈ విషయంపై రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ సెలవు పెట్టకుండా 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే వారి సభ్యత్వం రద్దు చేస్తామని తెలిపారు. ఇలా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పై అనర్హత వేటుపడితే తిరిగి పులివెందులలో ఉప ఎన్నికలు వస్తాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
మరి పులివెందులలో ఉప ఎన్నికల గురించి ఈయన మాట్లాడటంతో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడుతుందా అంటే పడకపోవచ్చునే చెప్పాలి ఎందుకంటే గతంలో పాదయాత్ర పేరుతో దాదాపు రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలోకి వెళ్లలేదు. అలాగే 2019 నుంచి 24 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు అయితే అప్పట్లో వీరిని ఎవరు సస్పెండ్ చేయలేదు కనుక ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉండవని తెలుస్తుంది.