ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా… ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. దాని కోసం ప్రతి పాఠశాలకు నిధులను కేటాయించింది. నాడు పాఠశాలలు ఎలా ఉన్నాయి.. నేడు ఎలా ఉన్నాయి.. అన్న నినాదంతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు.
ఇప్పటికే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా… విద్యార్థుల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా… స్కూల్ అటెండెన్స్ బుక్ లో విద్యార్థుల కుల, మతానికి సంబంధించిన వివరాలేవీ ఉండకూడదని… కులాలు, మతాలు ఆధారంగా పాఠశాలల్లో పిల్లలను ట్రీట్ చేయకూడదని… అందుకే.. అటెండెన్స్ బుక్ లో ఆ వివరాలన్నింటినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే.. స్కూల్ లో జాయిన్ అయినప్పుడు.. స్కూల్ రికార్డుల్లో మాత్రమే విద్యార్థుల కుల, మతానికి సంబంధించిన వివరాలు ఉంటాయని.. ఆ తర్వాత ఎక్కడా వాళ్ల కులం, మతానికి సంబంధించిన ప్రస్తావన రాకూడదని ప్రభుత్వం తెలిపింది.