Roja: మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్….. ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్…..అరెస్టు తప్పదా?

Roja: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన ఒక్కొక్కరిపై వివిధ ఆరోపణలు చేస్తూ వారిని జైలుకు పంపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జైలులో ఉన్నారు మరికొందరు జైలుకు వెళ్లి వచ్చారు. ఇకపోతే త్వరలోనే మాజీమంత్రి రోజా సైతం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా 47 రోజులకు ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఇటీవల అసెంబ్లీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక ఈ కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము దారి మళ్లీందని మంత్రి తెలిపారు.

ఇలా ఆడదాం ఆంధ్ర పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా రోజా సైతం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఏసీబీ విచారణకు అనుమతి తెలుపాలని కోరడంతో ఏసీబీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో రోజాకు గట్టి షాక్ తగిలింది .. ఆడుదాం ఆంధ్ర విషయంలో భారి స్కాం జరిగిందని నిజాలు బయటికి వస్తే మాత్రం రోజా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని తెలుస్తోంది.

ఇకపోతే గత ఐదు సంవత్సరాల కాలంలో కూటమినేతలపై రోజా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై కూటమినేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఈమె కనుక అవినీతికి పాల్పడ్డారని రుజువైతే మాత్రం వెంటనే అరెస్టు కాక తప్పదని తెలుస్తుంది. అయితే రోజా మాత్రం ఈ విషయం గురించి ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు ఆమె అయితే ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు చేసుకుంటూ బిజీ అవుతున్నారు.